![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ శ్రీహాన్ కి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు బుల్లితెర మీద షోస్ లో కనిపిస్తున్నాడు. త్వరలో ఒక మూవీలో కూడా కనిపించబోతున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న శ్రీహాన్ కి టాలీవుడ్ స్టార్ హీరోయిన్, రీసెంట్ గా "బటర్ ఫ్లై" మూవీతో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి ఇలా చేస్తే సిరికి చెప్తానని బెదిరించింది.
"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లాస్ట్ వీక్ ఎపిసోడ్ మంచి ఫన్నీగా సాగిపోయింది. ఇక ఈ షోలో బ్లాక్ డ్రెస్ లో వచ్చిన అనుపమ హైలైట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. "ఖుషి"లో నడుము సీన్ ని ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించారు. శ్రీహాన్, అనుపమ కలిసి పవన్ కళ్యాణ్, భూమికలాగ స్కిట్ చేసి చూపించారు. ‘సిద్దు నువ్ నా నడుము చూశావ్’ అని అనుపమా డైలాగ్ చెప్పగానే.. శ్రీహాన్ ‘‘లేదు నేను చూడలేదు. అయినా బెత్తెడంత చోటు లేదు, దాన్ని నేను చూశానంటా..పోనీ చూద్దామని ట్రై చేస్తే డ్రెస్ తో మొత్తం కప్పేసావ్’’ అని పవన్ కళ్యాణ్ స్టైల్లో డైలాగ్ చెప్పేసరికి బుంగమూతి పెట్టిన అనుపమ.. ‘‘ఇది నేను సిరికి చెప్తాను’’ అనేసరికి శ్రీహాన్ స్టన్ అయిపోయి డైలాగ్ చెప్పడం ఆపేశాడు. ఇక ఈ సీన్ తో సెట్ లో నవ్వులు విరిశాయి.
తర్వాత హోస్ట్ శ్రీముఖి వచ్చి సిరి పేరు వినేసరికి కనెక్షన్లు అన్ని కట్ ఇపోయాయ్...సూపర్ అనుపమ" అని ఒక హైఫై ఇచ్చింది. ఇక ఇదే సీన్ ని ఫైమా, నిహాల్ చేశారు. "నా నడుము నువ్వు చూడలేదు..సీ వన్ టైం..మ్యూజిక్ వేసుకోండి" అని భయపెట్టి మరీ ఈ స్కిట్ చేసింది. ఫైమా డైలాగ్స్ కి అందరూ నవ్వేశారు.
![]() |
![]() |